రీ రైటబుల్‌ పేపర్‌ వచ్చేసింది

ఏ పేపరైనా కొంతకాలానికి చిరిగిపోతుంది.దాని మీద ఉన్న రాతలు కొన్ని రోజులకు చెరిగిపోతాయి. ఈ ఇబ్బందుల్ని తప్పించే ఒక కొత్త రకం పేపర్ ను చైనా సైంటిస్టులు తయారు చేశారు. వారు తయారు చేసిన ఆ పేపర్ పై మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. ఫ్యుజియన్‌ నార్మల్‌ వర్సిటీకి చెందిన లుజోహు చెన్‌ బృందం ఈ పేపర్ ను తయారు చేసింది. ఈ పేపర్ 3 పొరలుగా ఉంటుంది. ఒక వైపు పొరపై ప్రత్యేకంగా తయారు చేసిన నీలిరంగును పూస్తారు. వేడి తగలగానే ఆ రంగు మాయమై పేపర్ తెల్లగా మారుతుంది. రెండోవైపు నలుపు రంగు పూస్తారు. దీన్ని వెలుతురులో పెట్టినప్పుడు వేడిని పుట్టిస్తుంది. 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణో గ్రతలో ఈ కాగితంపై నీలిరంగు వస్తూ పోతూ ఉంటుంది.

గది ఉష్ణోగ్రత దగ్గర ఈ పేపర్ తెల్లగా కనబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్‌ పది డిగ్రీల కంటే తక్కువుంటే పేపర్ నీలిరంగుకు మారుతుంది.వేడిని పుట్టించే ప్రత్యేకమైన పెన్నుతో ఈ కాగితంపై రాయొచ్చు. ఈ పేపర్ పై వందసార్లు రాసుకోవచ్చునని సైంటిస్టులు చెపుతున్నారు. పెన్నుతో రాసింది చెరిగిపోవాలంటే పేపర్ ను మైనస్‌ పది డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే చాలు. ఈ కొత్తరకం పేపర్ ను అనేక సార్లు ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల ఉపయోగం చాలా తగ్గుతుందని, ఫలితంగా కాగితం తయారీ కోసం చెట్లను నరకడం తగ్గిపోతుందని వారు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates