ఆవులను ఎందుకు ఇస్తున్నారంటే :
రువాండా దేశంలో కుటుంబానికో ఆవు అనే పథకం అమల్లో ఉంది. కనీస ఉపాధి కింద ఆ దేశ అధ్యక్షుడు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దీనిపేరు గిరింకా స్కీమ్. అందులో భాగంగా 200 కుటుంబాలకు మోడీ.. ఆవులను అందజేయనున్నారు. అదే విధంగా పలు ఒప్పందాలపైనా రెండు దేశాలు సంతకాలు చేయనున్నారు. రువాండా దేశానికి అవసరం అయిన మౌలిక వసతులు, అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కాబోతున్నది.
రువాండా దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి పార్లమెంట్ లో ఎక్కువ మంది మహిళలే సభ్యులు. ప్రపంచంలోని ఏ పార్లమెంట్ లోనూ ఇంత మంది మహిళలకు ప్రాతినిధ్యం లేదు. రువాండలో 2/3 మంది మహిళలే ఉంటారు.