రుషివో… శాసించు మనిషివో… : ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఎన్టీఆర్”. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో ఈ సినిమా రెండు భాగాలుగా జనవరి లో విడుదల కానుంది. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆయన స్వరపరిచిన రెండో పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది.

రాజర్షి టైటిల్ కార్డ్ తో ఉన్న ఈ పాటను కె.శివదత్తా, కె.రామకృష్ణ, ఎంఎం కీరవాణి రాశారు. శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల కలిసి ఈ పాటను పాడారు. ముందు శ్లోకంతో మొదలైన ఈ పాటను… గంభీరంగా అనిపిస్తుంది. మహానాయకుడి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగింది. బాలకృష్ణ, విద్యాబాలన్, కల్యాణ్ రామ్, రానా దగ్గుబాటి సహా… చాలామంది ప్రముఖులు ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates