రుస్తుం-2 పరీక్ష సక్సెస్

rustom-2-2స్వదేశీ పరిజ్ఞానంతో మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసిన రుస్తుం-2 మానవ రహిత నిఘా డ్రోన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (DRDO) ఆదివారం (ఫిబ్రవరి-25) విజయవంతంగా పరీక్షించింది. బెంగళూరు చిత్రదుర్గ సమీపంలోని చల్లాకేరేలో జరిగిన ఈ పరీక్షల్లో డీఆర్‌డీఓ చైర్మన్‌ ఎస్‌ క్రిస్టోఫర్‌, ఏయిరోనాటికల్‌ సిస్టం డీజీ సీపీ రామనారాయణన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డీజీ మంజుల పాల్గొన్నారు. ఈ డ్రోన్‌కు నిఘాతోపాటు.. ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యముందని, హైకాన్ఫిగరేషన్‌ ఇంజన్‌తో.. 24 గంటలపాటు నిరాటంకంగా పనిచేయగలదని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates