రూట్ కొత్త రికార్డు : 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన ఇంగ్లండ్

భారత్‌- ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డుల మోత మోగించాడు. ఎడ్జ్‌ బాస్టన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ జట్టు. అయితే మ్యాచ్  ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.  నిలకడైన బ్యాటింగ్‌ తో జెన్నింగ్స్‌ తో  కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు కెప్టెన్ జో రూట్. తన టెస్ట్ కెరీర్‌లో 6వేల పరుగుల మైలురాయిని రూట్ చేరుకున్నాడు. అతి తక్కువ వయసులో ఆరువేల పరుగుల మైలురాయిని చేరుకున్న జాబితాలో రూట్ చేరిపోయాడు. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 80 పరుగులు చేసిన రూట్…రన్ ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటివరకూ నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది ఇంగ్లండ్ జట్టు.

Posted in Uncategorized

Latest Updates