రూపాయి విలువ బాగా తగ్గింది

indian-currencyప్రపంచ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయ విలువ బాగా తగ్గింది. మన రూపాయ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది.  ప్రారంభ లాభాలనుంచి కిందికి పడి రూపాయి ఆరు పైసలు నష్టపోయింది.   ప్రస్తుతం 11 పైసలు క్షీణించి 65.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్యలోటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని చెప్పారు డీలర్లు. మరోవైపు  దేశీయంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. నిన్న(సోమవారం) రూపాయి విలువ 65.44 వద్ద ముగిసింది.

Posted in Uncategorized

Latest Updates