రూమర్స్ మాత్రమే.. ఎలాంటి కిడ్నాప్ ముఠాలు లేవు : సీపీ

psరాత్రిపూట దొంగలు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నారనే రూమర్స్ రావడంతో ప్రజలు ఆందోళనలో పడ్డారు. దీంతో హైదరాబాద్ లో ఎలాంటి కిడ్నాప్ ముఠాలు లేవని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. వాట్సప్‌లో తిరుగుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని నగరవాసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయనే వదంతుల క్రమంలో అమాయకులపై జరుగుతున్న దాడులపై నగర సీపీ అంజనీకుమార్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం సీపీ మాట్లాడుతూ.. విదేశాలకు చెందిన వీడియోలు రాష్ట్రంలో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. నేటి నుంచి రాత్రి వేళ్లలో అదనపు పెట్రోలింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా తప్పుడు వీడియో వస్తే తమకు సమాచారం ఇవ్వాలని.. దాన్ని మరెవరకీ పంపొద్దని చెప్పారు. చాంద్రాయణగుట్టలో శనివారం ముగ్గురిపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడని మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates