రూలర్‌‌ వచ్చేశాడు

బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న చిత్రంపై అందరి దృష్టీ ఉంది. దానికి కారణం.. బాలయ్య గత చిత్రం నిరుత్సాహపర్చడం, ఈ సినిమా మొదలయ్యాక బైటికొచ్చిన బాలయ్య లుక్ ఇంప్రెస్ చేయడం. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌నీ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా టైటిల్ విషయంలో పలు చర్చలు జరిగాయి. రూలర్, జడ్జిమెంట్ అంటూ చాలా పేర్లే వినిపించాయి. వీటిలో ‘రూలర్‌‌’ అనే టైటిల్‌నే ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇందులో బాలకృష్ణ పోలీసాఫీసరుగా కనిపించనున్నారు. ఖాకీ దుస్తుల్లో ఉన్న ఆయన పోస్టర్‌‌ని దీపావళి సందర్భంగా విడుదల చేశారు. గాగుల్స్‌ పెట్టుకుని స్టైల్‌గా, చేతిలో సుత్తి పట్టుకుని ఆవేశంగా ఉన్న బాలయ్య లుక్ బాగుంది. సింహా, లెజెండ్ సినిమాల తరహాలో మరో మాస్‌ ఎంటర్‌‌టైనర్‌‌ను చూడబోతున్నా మనిపిస్తోంది. బాలయ్యకి మరో భారీ హిట్ పడే చాన్స్ ఉందనిపిస్తోంది. అది నిజమో కాదో డిసెంబర్ 20న తేలుతుంది.

Latest Updates