రూల్స్ మార్చాలని కోర్టు ఆదేశం : పెళ్లి ఖర్చులు రిజిస్టర్ చేయాలి

పెళ్లి టైంలో పెట్టే ఖర్చు వివరాలను విధిగా వెల్లడించేలా.. నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు ఖర్చు వివరాలను మ్యారేజ్ రిజిస్ట్రార్ దగ్గర నమోదు చేసేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో పెళ్లి తర్వాత కట్నం విషయంలో తలెత్తే వివాదాలకు ఇది పరిష్కారంగా ఉంటుందని కోర్టు భావిస్తోంది. కట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరం అయినా.. లాంఛనాల కింద వాటిని చూపిస్తూ.. కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. ఆ సమయంలో నిజంగా ఇచ్చారా.. తీసుకున్నారా అనే విషయాలను తేల్చటం కష్టం అవుతుంది. దీంతో పెళ్లి సమయాల్లో వధూవరుల కుటుంబాలు విధిగా పెళ్లి ఖర్చులను రిజిస్ట్రార్ చేయించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింది.

వివాహ సమయంలో చేసే ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్‌ చేయడం ద్వారా వారి భవిష్యత్ కు భరోసా కల్పించవచ్చని వ్యాఖ్యానించింది కోర్టు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఇంతకు ముందున్న చట్టాల్లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates