రూల్ ఈజ్ రూల్ : యువరాణికి తప్పని ఆంక్షలు

harry-Meghanబ్రిటన్‌ యువరాజు హ్యారీని పెళ్ళాడిన హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ యువరాణి అయ్యింది. అయితే తనకు ఇక ఎలాంటి ఎదురు లేదనుకుంటే పొరపాటే. అక్కడ యువరాణి అయినా..ఆ స్థాయిలోనే రూల్స్ ఉంటాయి. మునుపటిలా ఆమె గడిపిన జీవితాన్ని గడపలేరు. యువరాణిగా ఆమెకు  సకల సౌకర్యాలు లభించటంతో పాటు రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా వర్తిస్తాయి. ఆ రూల్స్ ప్రకారం సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు. సోషల్‌ మీడియాలో అకౌంట్‌లు ఉండకూడదు. మినీ స్కర్ట్స్‌కు దూరంగా ఉండాలి. డిన్నర్‌ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. తన కంటే పై స్థాయిలోని వారిని మర్యాదపూర్వకంగా గౌరవించాలి. యువరాణి అయినా మేఘన్‌ కు నిబంధనలు పాటించక తప్పదన్న మాట.

Posted in Uncategorized

Latest Updates