రూ.10 కాయిన్స్ ను జీతాలుగా ఇచ్చారు

10 కాయిన్స్ చెల్లవంటూ ఓ వైపు ప్రచారం జరుగుతుంటే.. ముంబైలోని ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.10 కాయిన్స్ నే జీతాల రూపంలో ఇచ్చింది. ముంబైలోని బృహణ్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్(BEST) తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు నవంబర్ జీతాలను ఆలస్యంగా చెల్లించింది. జీతాలు ఆలస్యంగా వచ్చిన బాధలో ఉన్న ఉద్యోగులు.. జీతం కాయిన్స్ రూపంలో రావడంతో షాక్ అయ్యారు. బెస్ట్ కంపెనీ సుమారు 40 వేల మంది ఉద్యోగుల జీతాలకు సంబంధించి.. వారికి ఇవ్వాల్సిన శాలరీలో రూ.400 లను కాయిన్స్ రూపంలో చెల్లించి.. మిగతా శాలరీని వారి బ్యాంక్ అకౌంట్లలో వేసింది. చేసేదేమీ లేక ఉద్యోగులు చిన్నపాటి బ్యాగుల్లో ఆ కాయిన్స్ ను ఇంటికి తీసుకెళ్లారు.

జీతాలను కాయిన్స్ రూపంలో చెల్లించడానికి కారణం..

బెస్ట్ సంస్థ బస్సుల్లో ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. బస్సు టికెట్ చార్జీని ప్రయాణికులు వివిధ రూపాల్లో చెల్లిస్తుంటారు. దీనిలో భాగంగా ప్రతి నెలా రూ.70 లక్షల విలువైన రూ.10 నాణేలు ఛార్జీల రూపంలో సంస్థకు వస్తున్నాయి. పది రూపాయల కాయిన్స్ ను కొన్ని బ్యాంక్ లు తీసుకోకపోవడం,నెల నెలా కాయిన్స్ కూడా పెరిగిపోతుండటంతో సుమారు రూ.1.4 కోట్ల విలువైన కాయిన్స్ ను జీతాలుగా ఇచ్చినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates