రూ.100 కోట్ల క్లబ్ లోకి అరవింద సమేత

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా టీమ్ ఇవాళ (అక్టోబర్-14)న  ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. అక్టోబర్- 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది.

ఎన్టీఆర్‌ ఫర్మామెన్స్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్.. అభిమానుల నుంచే కాకుండా, సినీ వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే అరవింద సమేత.. రూ.100కోట్లు(గ్రాస్‌) వసూలు చేసినట్లు వెల్లడించింది యూనిట్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సునీల్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్.

https://twitter.com/HarikaHassine/status/1051433698082471937

 

Posted in Uncategorized

Latest Updates