రూ.11వేల కోట్ల కేసు : పక్కా ప్లాన్ గా మోడీ ఫ్యామిలీ జంప్

Nirav-Modiదేశంలో సామాన్యుడి రక్తం మరుగుతోంది.. అక్షరాల 11వేల కోట్లు బ్యాంకుల నుంచి కొట్టేసిన నీరవ్ మోడీ.. ఎంచక్కా దేశం నుంచి పారిపోయాడో తెలిస్తే.. నోరెళ్లబెడుతున్నారు జనం. దేశంలో సీబీఐ, సీఐడీ, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. గ్రాము బంగారం అయినా ఇట్టే పట్టేసుకునే ఎయిర్ పోర్ట్ అధికారులు.. 11వేల కోట్లు కొట్టేసిన ఫ్యామిలీ చక్కగా విమానాల్లో విదేశాలకు వెళ్లిపోతుంటే ఏం చేస్తున్నారని నిగ్గదీసి అడుగుతున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనపై కంప్లయింట్ చేస్తుందన్న సమాచారం అందించింది నీరవ్ మోడీకి. దీంతో విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేశాడు. అందుకు తమ్ముడు నిషాల్ సాయం తీసుకున్నాడు. అతనికి బెల్జియం పౌరసత్వం ఉంది. దీంతో అతనితో కలిసి ఈ ఏడాది (2018) జనవరిలో దేశం నుంచి పారిపోయాడు. ఎక్కడా అనుమానం జాగ్రత్త పడ్డాడు. సేఫ్ గా దేశం దాటాడు. ఆ తర్వాత వారం రోజులకు మామ చోక్సీకి ఫోన్ చేశాడు. అతను కూడా ప్లాన్ ప్రకారం దాటిపోయాడు. అమెరికా పౌరసత్వం ఉన్న భార్య అమీ మాత్రం ఇండియాలోనే ఉంది.

బ్యాంకుల్లో ఏం జరుగుతుంది.. ఎలాంటి కంప్లయింట్స్ ఫైల్ చేస్తున్నారు.. మీడియాలో వార్తలు వస్తున్నాయా అనే అన్ని విషయాలను నెల రోజులు ఉండి మరీ పరిశీలించింది. బ్యాంక్ అధికారులు సీబీఐకి కేసు అప్పగించారు అని సమాచారం అందిన వెంటనే.. కూతురితో కలిసి నీరవ్ భార్య కూడా అమెరికా వెళ్లిపోయింది. జస్ట్ 15 రోజుల్లోనే ఫ్యామిలీ మొత్తం విదేశాలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు అనేది స్పష్టమైన ఆధారాలు లేవు. బెల్జియం, అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో తలదాచుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వీరి ఆచూకీ కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది ఇండియన్ ఎంబసీ..

 

Posted in Uncategorized

Latest Updates