రూ.11వేల కోట్ల స్కామ్ : మాల్యాలాగే.. నీరవ్ మోడీ విదేశాలకు వెళ్లిపోయాడా!

niravmodiED

నీరవ్ మోడీ.. 11వేల కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీరవ్ మోడీ.. వజ్రాల వ్యాపారి. దేశంలోని అతిపెద్ద రెండో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి.. రూ.11వేల కోట్లను విదేశాలను తరలించారు. ఈ డబ్బును కుటుంబ సభ్యుల ఖాతాలను మళ్లించారు. ఇతర బ్యాంకులు  కూడా  నీరవ్ మోడీ …ఆయన కుటుంబ సభ్యులకు  అప్పులిచ్చి ఉండొచ్చని  అనుమానిస్తున్నారు. ముంబై  బ్రాంచ్ నుంచి  విదేశాల్లోని  కస్టమర్ల  అకౌంట్లకు నగదు  పంపినట్లు  అనుమానిస్తున్నారు.  లెటర్ అఫ్  అండర్ స్టాండింగ్…  ఫారిన్  లెటర్స్ అఫ్  క్రెడిట్ ఆధారంగా  అప్పులిచ్చినట్టు  అనుమానిస్తున్నారు.  ఈ కేసులో  ఇప్పటికే 10 మంది  దాకా  బ్యాంకు ఆఫీసర్లను  సస్పెండ్ చేశారు.  వాళ్లనుంచి  వివరాలు రాబడుతున్నారు.

పంజాబ్ నేషనల్  బ్యాంకు కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. PNB బ్యాంకు  బ్రాంచీలతో పాటు.. ఆ బ్యాంకు  నుంచి  పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన నీరవ్ మోడీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీ చేశారు. 11 వేల 300 కోట్లకు పైగా  డబ్బును తప్పుడు లావాదేవీలతో దారి మళ్లించినట్టు గుర్తించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇద్దరు ఉద్యోగులు అన్ ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేశారని.. జనవరి 3న మొదటగా గుర్తించామన్నారు MD సునీల్ మెహతా. వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇది ఒక బ్రాంచ్ లో మాత్రమే జరిగిందన్నారు. ఈ కేసుతో సంబంధమున్న ఉద్యోగులను వదిలేది లేదన్నారు. ఈ కుంభకోణం నుంచి బయటపడే సత్తా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఉందనే ధీమా వ్యక్తం చేశారు ఎండీ.

నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడా?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ కనిపించటం లేదు. ఆచూకీ లేదు. విజయ్ మాల్యా లాగే ఇతను కూడా విదేశాలకు పారిపోయి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశం వెళ్లి ఉంటాడని భావిస్తున్నాయి. 11వేల కోట్లు ఎగ్గొటి విదేశాలకు వెళ్లిపోవటం అంటే.. విజయ్ మాల్యానే గుర్తుకొస్తున్నాడని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates