రూ.15 లక్షలు స్వాధీనం : నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

గుట్టు చప్పుడుగా నకిలీ నోట్లను రవాణా చేస్తున్న ముఠాను ఆదివారం (జూలై-29) పట్టుకున్నారు విజయవాడ పోలీసులు. భవానీపురంలో రూ.15లక్షల విలువైన నకిలీ నోట్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గరు నిందితులను అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నోట్ల రవాణా సాగుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో ముగ్గురు నిందితులని అరెస్టు చేశారు. నకిలీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు గతంలోనూ నకిలీ నోట్లు మార్చారని పోలీసులు నిర్ధారించారు. కరెన్సీని ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates