రూ.32 వేలు దాటిన బంగారం ధర

బంగారం,వెండి ధరలు పరుగు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాలు, వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర ఒక్కరోజే రూ.500కు పైగా పెరిగి రూ.32 వేల మార్క్ ను దాటింది. స్వచ్ఛమైన బంగారం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములకు రూ.555 పెరిగి రూ.32,030కి చేరుకుంది.

కేజీ వెండి ధర రూ.450 పెరిగి రూ.39,400కు చేరుకుంది.  అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.32 శాతం పెరిగి 1207 డాలర్లుగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates