రూ.35వేల కోట్లతో డీల్ : దేశంలోనే మొదటి విమాన తయారీ ఫ్యాక్టరీ

aircrafttమహారాష్ట్రలో విమాన తయారీ కంపెనీ ఏర్పాటుకు కమర్షియల్ పైలట్ అమోల్ యాదవ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం (ఫిబ్రవరి-20) ఒప్పందం కుదుర్చుకున్నారు.35 వేల కోట్లతో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో అమోల్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ కంపెనీ ద్వారా 10 వేల ఉద్యోగాలను క్రియేట్ చేయనున్నారు. పాల్గార్ జిల్లాలోని 157 ఎకరాల్లో కంపెనీ స్థాపించనున్నారు. ఈ కంపెనీ ద్వారా 6 సీటర్, 19 సీటర్ విమానాలను తయారు చేస్తారు. కంపెనీకి కావాల్సిన నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. తొలి దశలో 19 సీటర్ విమానాలను తయారు చేస్తారు. దీని కోసం కనీస పెట్టుబడి రూ.200 కోట్లు అవసరం ఉంటుంది. రానున్న మూడేళ్లలో 600 వరకు 19 సీటర్ల విమానాలను తయారు చేయనున్నారు. ఆ తర్వాత ఆ టార్గెట్‌ను 1,300కు చేర్చాలనుకుంటున్నారు. ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ విమాన ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు యాదవ్ తెలిపాడు. గతంలో జెట్ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా చేసిన యాదవ్.. ఇప్పుడు థ్రస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates