రూ.500 కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఐదు రెట్లు పెంపు

Notes-500దేశంలో ప్రస్తుతం నెలకొన్న నగదు కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.డబ్బులకోసం ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని 500 నోట్ల కరెన్సీ ప్రింటింగ్‌ను ఐదు రెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్ధిక వ్యవహరాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్  ప్రకటించారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే కరెన్సీ సరఫరాను మరింత పెంచేందుకు చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

మంగళవారం(ఏప్రిల్-17) మీడియాతో మాట్లాడిన సుభాష్  చంద్ర గార్గ్ …వచ్చే రెండు రోజుల్లో రోజుకు రూ.2,500 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్టు తెలిపారు దీంతో నెలకు సరఫరా రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. డిమాండ్‌కు మించి ఇప్పటికే నగదు స్టాక్ ఉందన్నారు.డిమాండ్‌కు మించి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కరెన్సీ స్టాక్‌ ఉందని.. గత కొన్ని రోజులుగా ఈ నగదును సిస్టమ్‌లోకి పంపించామన్నారు. ఇంకా రూ.1.75 లక్షల కోట్ల రిజర్వులు తమ దగ్గర ఉన్నాయన్నారు. అయితే  రెండు నెలల నుంచి అసాధారణంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ అసాధారణ డిమాండ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates