రూ.579 కోట్లు కట్టాల్సిందే : ఎయిర్ లైన్స్ కేసులో మాల్యాకు షాక్

ndtvభారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను అద్దెకు తీసుకున్న బీఓసీ ఏవియేషన్‌కు రూ.579 కోట్లు చెల్లించాలంటూ బ్రిటన్‌ హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయ పోరాటంలో విజయ్ మాల్యాకు ఇది పెద్ద దెబ్బ. లీజింగ్‌ అగ్రిమెంట్‌ ప్రకారం కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్‌ మూడు విమానాలను సరఫరా చేసింది. వాటికి సంబంధించి చెల్లింపులు చేయలేదు. దీంతో ఆ సంస్థ కోర్టుకెక్కింది. ప్రతివాదులు దావాను రక్షించే అవకాశాన్ని కలిగి ఉన్నారంటూ కోర్టు తన తీర్పులో తెలిపింది. కోర్టు వెలువరించిన తీర్పును బీఓసీ ఏవియేషన్‌ స్వాగతించింది. మరోవైపు బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో నిందితుడైన విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ కొనసాగుతుంది.

 

Posted in Uncategorized

Latest Updates