రూ.637కోట్ల నీరవ్‌ ఆస్తులు జప్తు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ఆస్తులను జప్తు చేస్తుంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ). నీరవ్‌, ఆయన కుటుంబసభ్యులకు చెందిన సుమారు రూ.637కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది ఈడీ. భారత్‌ సహా ఐదు దేశాల్లో ఉన్న ఈ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. భారత్‌, యూకే, అమెరికాల్లోని స్థిరాస్తులు, ఆభరణాలు, ఫ్లాట్లు, బ్యాంకు బ్యాలెన్స్‌లను, తదితర ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన వివిధ ఆదేశాల మేరకు నీరవ్‌ ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది ఈడీ. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య నానావటిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మోసానికి పాల్పడిన కేసులో వజ్రాల వ్యాపారులైన నీరవ్, మెహల్‌ ఛోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates