రూ.649కే రెడ్ మి నోట్ 5 ప్రో

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ , బిగ్‌ షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ నిర్వహిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ డేకు పోటీగా నిర్వహిస్తున్న ఈ సేల్‌, జూలై 19తో ముగుస్తోంది. ఈ క్రమంలో షావోమి రెడ్‌ మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ అత్యంత తక్కువగా రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫోన్‌ ను కొనుగోలు చేద్దామని ఎప్పడి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న షావోమి ఫ్యాన్స్‌ కు ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌. అంతేకాక తగినంత స్టాక్‌ ను కూడా అందుబాటులో ఉంచింది. అసలు రెడ్ మీ నోట్ 5 ప్రో  బేస్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ.14 వేల 999 కాగ, టాప్‌ ఎండ్‌ వెర్షన్‌ 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర 16 వేల 999 రూపాయలు. ఈ రెండు వెర్షన్లు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బిగ్‌ షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌ సందర్భంగా బేస్‌ వెర్షన్‌ను రూ.649కు, టాప్‌-ఎండ్‌ వెర్షన్‌ ను రూ.2వేల649కు ఫ్లిప్‌ కార్ట్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఈ భారీ డిస్కౌంట్‌ ను పొందడానికి కస్టమర్లు రెండు రకాల ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఒకటి మరో స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో దీన్ని కొనుగోలు చేయడం, మరొకటి SBI క్రెడిట్‌ కార్డు కలిగి ఉండటం. ఎక్స్చేంజ్‌పై 12 వేల,850 రూపాయల వరకు తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్‌ చేస్తుండగా.. SBI క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌ స్టాంట్‌ డిస్కౌంట్‌ ను ఇస్తోంది. ఈ గరిష్ట డిస్కౌంట్‌ ను పొందడానికి కొనుగోలుదారులు ఈ రెండు ప్రమాణాలను కలిగి ఉండాలి.

 

 

 

Posted in Uncategorized

Latest Updates