రూ. 737 కోట్ల బాకీ : దివాళా తీసిన సెవెన్ హిల్స్

Seven-Hills---Vishakhapatnamముంబై, వైజాగ్ లలో ప్రముఖ వైద్య సంస్థగా ఉన్న సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ సంస్థ దివాళా తీసింది. ఈ సంస్థ యాక్సిస్, తదితర బ్యాంకులకు మొత్తం 737 కోట్ల మేర బాకీ పడింది. రుణ బకాయి చెల్లించడానికి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో యాక్సిస్‌ బ్యాంకు.. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) హైదరాబాద్‌ బెంచ్ లో పిటిషన్ వేసింది. దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టాలని యాక్సిస్‌ బ్యాంకు ఐబీసీ కోడ్‌ సెక్షన్‌ 7 కింద దరఖాస్తు చేసింది. దీనిపై NCLT జ్యుడీషియల్‌ సభ్యులు రాజేశ్వరరావు విత్తనాల విచారణ చేపట్టి, దివాలా ప్రక్రియ ప్రారంభానికి అనుమతిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2014 జూన్‌ 30న యాక్సిస్‌ బ్యాంకుతో ఆసుపత్రి ట్రస్టీల ఒప్పందం కుదిరింది. అయితే, అగ్రిమెంట్ ప్రకారం వాయిదాలు చెల్లించకపోవడంతో 2016 ఏప్రిల్‌ 2 వరకు రూ.737.58 కోట్లను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంకు.. సెవెన్‌హిల్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాకట్టులో ఉన్న వాటాలను వెనక్కి తీసుకుంటామని బ్యాంకు ట్రస్ట్‌ను కోరింది. అయితే, తాకట్టులో ఉన్న వాటాలను మార్చుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సెవెన్‌హిల్స్‌ ప్రమోటర్స్‌ జితేంద్ర మాగంటి, మాగంటి జితేంద్ర దాస్‌ (HUF) జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లినా ఫలితం లేకపోయింది. లాస్ట్ గడువు విధించి బకాయి చెల్లించాలని ఆదేశించినా అమలు చేయకపోవడంతో బ్యాంకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతించాలని కోరింది.

Posted in Uncategorized

Latest Updates