రెంటెడ్ రూమ్స్ లో ఉండేందుకే యూత్ ఆసక్తి

images-h3-500x500సిటీ యువత ఎక్కువగా ఇండిపెండెంట్ గా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టూడెంట్స్ అయినా.. ఉద్యోగం చేసేవాళ్ళైనా హాస్టల్స్ లో ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. నచ్చినట్లు ఉండేందుకు రెంటెడ్ రూమ్స్ బెటరంటున్నారు. సిటీలో ఉండే విద్యార్థులు, యువతలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఊరి నుంచి పై చదువుల కోసం సిటీకి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు హాస్టల్స్ లో ఉండేవారు. టైంకు ఫుడ్ తో పాటు సెక్యూరిటీ ఉండటంతో హాస్టళ్లకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం హాస్టల్స్ లో ఉండటం కంటే రూమ్ రెంట్ కు తీసుకొని ఉండేందుకే ఇష్టపడుతున్నారు.

నెలనెలా వేలకు వేలు పోసి నచ్చని తిండి తినడం కంటే..ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ తీసుకుంటే బెటర్ అంటున్నారు. రూమ్ లో అయితే ఇష్టమైన ఫుడ్ తినొచ్చు… నచ్చినట్టు ఉండొచ్చని చెబుతున్నారు. హాస్టల్స్ లో ఇరుకుగా వందల మందితో ఉండటం కంటే రెంట్ కు రూమ్ తీసుకొని కంఫర్ట్ గా ఉండటమే మంచిదంటున్నారు. అమ్మాయిలు కూడా రూమ్ తీసుకొని ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హాస్టల్స్ లోనే ఉండాలి.. బయటికి వస్తే సేఫ్టీ ఉండదనే రోజులు పోయాయంటున్నారు. రూమ్ లో ఉన్నా సెక్యూరిటీ చూసుకుంటే చాలంటున్నారు. హాస్టల్లో కంటే రూమ్ లో అయితే ఇష్టప్రకారం ఉండొచ్చని చెబుతున్నారు.

హాస్టల్స్ లో ఫీజులు ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి రూల్స్ కూడా అంత సెట్ కావంటున్నారు యూత్. టైమింగ్స్ కూడా పెద్ద సమస్య అవుతోందనీ..ఫ్రెండ్స్ ని హాస్టల్లోకి అనుమతించరని చెబుతున్నారు. ఎవరు ఎక్కడున్నా కంఫర్ట్ ఉండటంతో పాటు పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకుండా..ఎవరి పని వారు చేసుకుంటే ఎలాంటి సమస్యే ఉండదంటున్నారు యూత్.

Posted in Uncategorized

Latest Updates