రెండవ టీ-20 : పరువు కోసం ఐర్లాండ్, ప్రయోగాలతో భారత్

irlప్రయోగాలతో భారత్.. పరువు కోసం ఐర్లాండ్. డబ్లిన్ లో రెండో టీ20లో తలపడబోతున్నాయి. ఫస్ట్ టీ20లో 76 రన్స్ తేడాతో గెలిచిన భారత్… ఈ మ్యాచ్ లో పలు మార్పులతో బరిలో దిగనుంది. ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు ప్రయోగాలు చేసేందుకు రెడీ అయింది.
భారత్-ఐర్లాండ్ మధ్య రెండో టీ-20 రాత్రి డబ్లిన్ లో జరగనుంది. బుధవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ ను దంచేసింది కోహ్లీ సేన. బ్యాటింగ్-బౌలింగ్ లో తిరుగులేని అధిపత్యం చలాయించింది. రోహిత్-ధవన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఫస్ట్ టీ20లో 16 ఓవర్ల దాకా ఓపెనర్లే ఆడటంతో మిగతా బ్యాట్స్ మెన్ కు పెద్దగా ఛాన్స్ రాలేదు. ఇవాళ్టి మ్యాచ్ లో బ్యాటింగ్ లో ప్రయోగాలు చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు.. బ్యాట్స్ మెన్ అందరితోనూ ప్రయోగాలు చేసేందుకు స్కెచ్ వేసింది. సురేష్ రైనా, మనీష్ పాండేకు బ్యాటింగ్ లో ప్రమోషన్.. దినేష్ కార్తీక్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది టీం. ఇక ఫస్ట్ టీ20లో ఫీల్డింగ్ లో పూర్ పర్ ఫామెన్స్… క్యాచులు అందుకోవడంతో ఫెయిలయ్యారు మన ప్లేయర్లు. ఫీల్డింగ్ పైనా ఫోకస్ చేయాలని డిసైడెంది.
అటు ఐర్లాండ్ ది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రయోగాల జోలికి పోకుండా.. ఎలా గెలవాలన్నదానిపై ఫోకస్ పెట్టింది ఐరిష్ టీం. జేమ్స్ షానన్, సిమీ సింగ్ లాంటి యంగ్ బ్యాట్స్ మెన్ పైన ఆధారపడిందా టీం. ఓపెనర్ స్టిర్లింగ్, ఆల్ రౌండర్ కెవిన్ ఒబ్రెయాన్ రాణిస్తే భారత్ కు కష్టాలు తప్పవు. బ్యాటింగ్ సైడ్ పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్ డిపార్ట్ మెంట్ వీక్ గా కనిపిస్తోంది. టీమిండియా తానాడిన గత ఐదు టీ20ల్లోనూ గెలిచింది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి… మంగళవారం ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు కాన్ఫిడెంట్ గా వెళ్లాలని భావిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates