రెండుచోట్ల ఆమ్రపాలి రిసెప్షన్స్

Amrpali-Kataవరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ నెల 18న IPS సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. 2011 బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్ సమీర్‌‌శర్మను ఆమ్రపాలి పెళ్లి చేసుకోబోతున్నారు. సమీర్‌‌శర్మ ప్రస్తుతం డయ్యూ-డామన్‌లో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

18 సమీర్‌‌ సొంత రాష్ట్రం జమ్ముకాశ్మీర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరుగనుంది. దీంతో ఫిబ్రవరి 15వ తేది నుంచి మార్చి 7 వరకు ఆమ్రపాలి సెలవులో ఉండబోతున్నారు. పెళ్లి జమ్ములో జరుగుతున్నప్పటికీ, ఇక్కడి సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీన వరంగల్‌లో 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు హోటల్స్ బుక్ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు తన భర్త సమీర్‌తో ఆమె టర్కీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates