రెండు జిల్లాల్లో సీఎం మూడురోజుల పర్యటన షెడ్యూల్

kcrఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మూడురోజుల పర్యటనకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. రేపు(సోమవారం,ఫిబ్రవరి-26) ఉదయం కరీంనగర్ వెళ్లనున్నారు. రైతు సమన్వయ సమితుల రెండో సదస్సులో పాల్గొంటారు. రాత్రికి అక్కడే ఉండి.. మంగళ, బుధవారాల్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. సీఎం టూర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు

రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సును పూర్తిచేసిన సీఎం కేసీఆర్.. రేపు(సోమవారం-26) కరీంనగర్ సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం పదిన్నరకు హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకోనున్న సీఎం.. స్థానిక అంబేడ్కర్  మైదానంలో 15 జిల్లాల రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశమౌతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల మంది హాజరు కానుండటంతో.. ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు జిల్లా అధికారులు. సదస్సు ప్రారంభానికి ముందు హాజరైన వారి వివరాలను నమోదు చేయనున్నారు అధికారులు.

రేపు(సోమవారం-26) రాత్రి కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలోని.. ఉత్తర తెలంగాణ భవన్ లో బసచేస్తారు సీఎం. మంగళవారం(ఫిబ్రవరి-27) ఉదయం 10గంటల 45 నిమిషాలకు.. ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దులోని చనాకా కొరాట బ్యారేజ్ ను సందర్శించి.. పనులను పరిశీలిస్తారు. తిరిగి ఆదిలాబాద్ చేరుకుని.. స్థానిక డైట్ కళాశాల గ్రౌండ్ లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమావేశమౌతారు. లంచ్ తర్వాత మంచిర్యాల జిల్లా సీసీసీ కాలనీ, శ్రీరాంపూర్ లోని సింగరేణి ఏరియాల్లో పర్యటిస్తారు సీఎం. సాయంత్రం ఐదున్నర గంటల వరకు సింగరేణి సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుని.. ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బసచేస్తారు.

మూడో రోజు బుధవారం(ఫిబ్రవరి-28).. రామగుండం రీజియన్ లోని సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తారు సీఎం. ప్రగతి స్టేడియంలో నిర్వహించే సింగరేణి కార్మికసభలో పాల్గొంటారు. అక్కడి నుంచే మందమర్రి ఏరియా కాసిపేట 2, కె.కె.6, మణుగూరు ఏరియా కొండాపురం గని, భూపాలపల్లి ఏరియా కేటీకే-3, కేటీకే-5, కొత్త బొగ్గు గనులను ప్రారంభిస్తారు సీఎం. లంచ్ తర్వాత ముర్మూర్ లో అంతర్గాం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత హెలికాప్టర్ లో బయలుదేరి హైదరాబాద్ ప్రగతిభవన్ చేసుకుంటారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates