రెండు నెలలు 20 రైళ్లు రద్దు

ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర పొగమంచు కారణంగా 20 రైళ్లను దాదాపు రెండు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే (NER) ప్రకటించింది. గోరఖ్‌పూర్‌, బస్తి డివిజన్లతో సహా పలు విభాగాలలో రైళ్లను రద్దు చేసింది. రైళ్ల రద్దు ఇవాళ్టి నుంచి (గురువారం, డిసెంబర్-13) వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకూ అమల్లో ఉంటుంది. మరో 14 రైళ్ల రాకపోకలను కూడా తగ్గించారు. ఈ రెండు నెలలు ప్రయాణికులు సాధ్యమైనంత వరకు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా సూచించింది.
రద్దైన రైళ్లలో.. గోరఖ్ పూర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్, అమృత్ సర్-గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్, సీతామర్హి – ఆనంద్ విహార్ ఎక్స్ ప్రెస్, ఆనంద్ విహార్-సీతామర్హి ఎక్స్ ప్రెస్, జైనగర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్, అలహాబాద్-బస్తీ ఎక్స్ ప్రెస్, బస్తీ – అలహాబాద్ ఎక్స్ ప్రెస్ ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates