రెండు నెలల్లో వచ్చేస్తోంది : 3 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

telangana-logoతెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలో మరో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 7 వేల 892 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి TSPSC నుంచి నోటిఫికేషన్ వెలువడింది.

ఈ నెల మూడో వారంలో రాత పరీక్షలను నిర్వహించి, ఆ వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ  రెండు నెలల్లో ముగియనుంది. ఆ వెంటనే మరో TRT నోటిఫికేషన్‌కు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది సర్కార్. తర్వాత నోటిఫికేషన్‌లో భర్తీ చేయటానికి 3వేల పోస్టులను గుర్తించినట్లు విద్యాశాఖ తెలిపింది. వీటిని TSPSC ద్వారా భర్తీచేయాల్సి ఉంటుంది. సర్కారీ పాఠశాలలను బలోపేతంచేసి, ఉత్తీర్ణత శాతం పెంచడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలన్న సంకల్పంలో భాగంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ వరకు పదవీ విరమణ, ట్రాన్స్‌ఫర్, బదిలీలతోపాటు పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వల్ల మరికొన్ని ఖాళీలు అదనంగా ఏర్పడే అవకాశాలున్నాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

 

 

Posted in Uncategorized

Latest Updates