రెండు పడవలు ఢీ..11 మంది మృతి

RUSSYA DEATHరెండు పడవలు ఢీకొట్టడంతో 11 మంది చనిపోయినన ఘటన రష్యాలో జరిగింది. మంగళవారం (జూన్-12) రష్యాలోని ఓల్గా నదిలో 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి.

16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.  సమాచారమందుకున్న ఎమర్జెన్సీ  విభాగం సిబ్బంది ఓల్గా నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. వీరిలో ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సహాయక చర్యలు ముగిశాయని, ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రయాణికులు చనిపోయారని స్థానిక అత్యవసర విభాగం అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates