రెండు బ్రిడ్జిల మధ్య పడిపోయిన బస్సు

ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రెండు బ్రిడ్జిల మధ్య పడిపోయింది. శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

తెనాలి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం కొత్తగూడెం దగ్గరకు రాగానే  ఒక్కసారిగా అదుపుతప్పి రెండు బ్రిడ్జిల మధ్యలో పడిపోయింది . ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ ను ఆస్పత్రికి తరలించారు. బస్సు వంతెన నుంచి కింద పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates