రెండు రోజులు భారీ వర్షాలు : ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న వానలు

వాయుగుండం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం కూడా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుకుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో… కుండపోత వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ, గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోనూ వానలు దంచికొడుతున్నాయి. నాగావళి ఉగ్రరూపం దాల్చటంతో… శ్రీకాకుళం సమీపంలోని రాయగూడ దగ్గర బ్రిడ్జి కుప్పకూలింది. రాజస్థాన్ లోనూ వరదనీటిలో చిక్కుకున్న కారులోంచి నలుగురిని కాపాడారు స్థానికులు.

రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఒడిశా వణికిపోతుంది. భువనేశ్వర్ లో రోడ్లన్నీ జలమయం కాగా… ఇళ్లల్లోకి నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లన్నీ బురదమయంగా మారటంతో… ప్రభుత్వాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోయారు. రాయగడ, మల్కనగిరి, కందమాల్, గజపతి జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పూరిలో రికార్డు స్థాయిలో 269 మిల్లీమీటర్లు, భువనేశ్వర్ లో 195 మిల్లీమీటర్లు, కటక్ లో 211 మిల్లీమీటర్లు, కోరాపుట్ లో 185 మిల్లీమీటర్లు, భవానిపట్నాలో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత పదేళ్లతో పోలిస్తే ఇదే రికార్డని వెదర్ ఆఫీసర్లు చెప్తున్నారు.

ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రహదారులకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగావళి ఉగృరూపం దాల్చి జనం చూస్తుండగానే… రాయగడ దగ్గర బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరాఖండ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. నడుము లోతు వరద నీటితో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. హరిద్వార్ లోని ఖర్కారీ ఏరియాలో వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. కారులో ఎవరూ లేకపోవటంతో…ప్రాణపాయం తప్పింది. వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణించి ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లోని బాలాసోర్ దగ్గర తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది.

Posted in Uncategorized

Latest Updates