రెండు రోజుల పర్యటనకు చైనాకు..కిమ్

kimchinaఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు. మంగళ (జూన్-19), బుధవారాల్లో (జూన్-20) కిమ్‌ చైనాలో పర్యటించనున్నారు. ఇటీవల కిమ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సింగపూర్‌లో భేటీ అయిన వారం రోజులకే కిమ్‌ చైనా పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజింగ్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెండు రోజుల చైనా పర్యటన నిమిత్తం ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్నారు. చైనా అగ్ర నేతలతో కిమ్‌ మంగళవారం, బుధవారం రెండు రోజులు కీలక సంప్రదింపులు జరపనున్నట్టు సమాచారం. చైనాలో కిమ్‌ పర్యటించడం ఈ ఏడాదిలో ఇది మూడవసారి. గతంలో మార్చిలో బీజింగ్‌ సందర్శించిన కిమ్‌ మేలో ఈశాన్య నగరం దలియాన్‌లో పర్యటించారు. నిరాయుధీకరణకు కొరియా కట్టుబడి ఉంటుందని ప్రకటించిన క్రమంలో ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరేందుకే కిమ్‌ చైనా పర్యటనకు వచ్చారని భావిస్తున్నారు.

కొరియా ద్వీపకల్పంలో నిరాయుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉందని ట్రంప్‌తో భేటీ సందర్భంగా కిమ్‌ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.

Posted in Uncategorized

Latest Updates