రెండూ ఒకే కార్డులో: డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌

డెబిట్‌, క్రెడిట్‌… రెండు కార్డులు వాడుతున్నారా? అయితే ఇకపై అలాంటి అవసరం లేదట. ఒకే కార్డులో రెండింటిన్నీ వాడుకోవచ్చంటున్నారు బ్యాంకు అధికారులు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మొదటి సారిగా 2 ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌ కార్డును ప్రవేశపెట్టింది. ఈ టూ ఇన్‌ వన్‌ డ్యూ కార్డు రెండు మాగ్నెటిక్‌ స్ట్రిప్స్‌, 2 EMV చిప్స్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇవి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు చేసే రెండు పనులను చేస్తోంది. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు డెబిట్‌ కమ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చినట్టు బ్యాంక్‌ చెప్పింది. ప్రతి రోజూ జరిపే క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల అన్ని లావాదేవీలకు రెండు కార్డులను తీసుకు వెళ్లాల్సినవసరం లేకుండా.. ఇక నుంచి ఒకే కార్డును తీసుకువెళ్లవచ్చని చెప్పింది. అనగ్రామ్‌ టెక్నిక్‌తో ఈ కార్డును బ్యాంక్‌ డిజైన్‌ చేసింది.

ఇండస్‌ ఇండ్‌ డ్యూ కార్డు మొబైల్‌ కస్టమర్ల కోసం  ముఖ్యంగా యువత కోసం ఎంటర్‌టైన్‌మెంట్‌, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్  వంటి పలు ఫీచర్లను ముందస్తుగా అప్‌లోడ్‌ చేసుకుని వచ్చింది. బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసి, తమ కస్టమర్లకు సౌకర్యవంతంగా తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అధికారులు. యువత, ఔత్సాహికులైన కస్టమర్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని…  ఒక్క ప్లాస్టిక్‌ కార్డులోనే చాలా ఆఫర్లను అందించనున్నట్టు తెలిపారు బ్యాంకు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates