రెండోరోజూ ప్రత్యేక పూజలు : శాకంబరి దేవీగా బెజవాడ దుర్గమ్మ

AP విజయవాడ దుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు రెండో రోజు గురువారం ( జూలై-26) ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా అలంకరించారు అర్చకులు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని పండ్లు, కూరగాయలు సమర్పిస్తున్నారు.

మనిషి ఆకలిని తీర్చడానికి అమ్మవారు భూమిపై ఉద్భవించిందని… చెబుతున్నారు పూజారులు. శాకంబరీ దేవీ రూపంలో దుర్గమ్మ పూజిస్తే  క్షామం నుండి విముక్తి లభిస్తుందని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులు తెల్లవారుజాము నుంచే లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం( జూలై-27) చంద్రగ్రహనం కావడంతో గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపిన ఆలయ అధికారులు..శుక్రవారం గుడి మూసివేయనున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates