రెండో అత్యంత విలువైనదిగా : SBIని బీట్ చేసిన కొటక్ మహీంద్రా

KPCCదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) ను ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బీట్ చేసింది. మొదటిసారి SBIని బీట్ చేసిన కొటక్ మహీంద్రా దేశంలో రెండవ అత్యంత విలువైన బ్యాంక్ గా చోటు దక్కించుకుంది. BSE డేటాలో కొటక్ షేర్లు ఈ రోజు(ఏప్రిల్-16) ట్రేడింగ్‌ లో 1.7శాతం పెరగడంతో బ్యాంక్ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,22,560.69 కోట్లకు పెరిగింది. గత రెండు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి కొటక్‌ షేర్లు ఆల్‌-టైమ్‌ హైలో రికార్డు అవుతున్నాయి.

SBI మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,22,043.74 కోట్లకే పెరిగినట్టు BSE  డేటా తెలిపింది. అయితే రూ.5.04 ట్రిలియన్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తో HDFC దేశంలో అత్యంత విలువైన బ్యాంక్ గా మొదటిస్ధానంలో కొనసాగుతుంది. వ్యాపారాల్లో మెరుగైన వృద్ది కనబర్చడం, ఆస్తుల నాణ్యత వంటి అంశాల కారణంగా కొటక్ షేర్లను కొనేందుకు పెట్టుబడిదారులు ఆశక్తి కనబరుస్తున్నట్లు బ్యాంకింగ్ నిపుణులు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates