రెండో టెస్టుకు భారత టీమ్ ఇదే..

పెర్త్ : ఆస్ట్రేలియాతో శుక్రవారం డిసెంబర్-14 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ కు టీమ్ అనౌన్స్ అయ్యింది. 13 మందితో కూడిన టీమిండియాను ఇవాళ డిసెంబర్-13న ప్రకటించింది BCCI. స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయాల కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కానున్నారు. మడమ గాయంతో తొలి టెస్ట్‌ కు దూరమైన పృథ్వి షా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ ముగ్గురూ టీమ్ లో సెలక్ట్ కాలేదు.  ఫస్ట్ టెస్ట్‌ లో ఆరు వికెట్లు తీసి టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన అశ్విన్ లేకపోవడం.. టీమ్‌ కు పెద్ద దెబ్బే.

పెర్త్ టెస్ట్‌ కు టీమ్ ఇదే:

విరాట్ కోహ్లి, విజయ్, రాహుల్, పుజారా, రహానే, విహారి, రిషబ్ పంత్, జడేజా, ఇషాంత్ శర్మ, షమి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్, ఉమేష్ యాదవ్.

Posted in Uncategorized

Latest Updates