రెండో వన్డే: ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ


లార్డ్స్ వన్డేలో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండో వన్డేలో భారత్ పై 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 322 రన్స్ చేసింది.  రాయ్ 40 , బెయిర్ స్టో 38, రూట్ 113, మోర్గాన్ 53, విల్లే 50 రన్స్ కొట్టారు. 323 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ … బ్యాటింగ్ లో చతికిలపడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 15 , శిఖర్ ధావన్ 36 రన్స్ చేసి పెవిలియన్ దారి పట్టారు. కోహ్లీ 45, రైనా 46 రన్స్ చేశారు. 50 ఓవర్లు ఆడిన భారత్ 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-1 పాయింట్లతో భారత్ – ఇంగ్లండ్ టీంలు సమంగా నిలిచాయి. చివరి వన్డే ఈ నెల 17న లీడ్స్ లో జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates