రెండో విడత రైతుబంధు : నెల రోజుల ముందే చెక్కుల పండుగ

పంటకు పెట్టుబడి కింద అన్నదాతలకిచ్చే రైతుబంధు రెండో విడత కార్యక్రమాన్ని.. మరింత ముందుకు తీసుకురావాలని చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎలక్షన్స్ టైం దగ్గరపడుతుండటంతో..రబీ పెట్టుబడి చెక్కులను నెల రోజుల ముందే రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ – 5 నుంచి చెక్కుల పంపిణీ మొదలు పెట్టనుంది. అక్టోబర్- 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల పంపిణీపై దృష్టి సారించింది.

రబీ సీజన్‌ కు సంబంధించిన రైతుబంధు చెక్కులను నవంబర్‌ లో పంపిణీ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికల హడావుడి ఉంటుంది. ప్రజలు, అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉంటారు. పైగా షెడ్యూల్‌ జారీ చేశాక పంపిణీ వ్యవహారం క్లిష్టంగా మారనుంది. షెడ్యూల్‌ వచ్చాక ఎన్నికల కమిషన్‌ పంపిణీకి అనుమతి ఇస్తుందా ..లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ముందే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా RBIకి  ఇటీవల లెటర్ రాసి.. అక్టోబర్‌ లోనే బ్యాంకుల్లో క్యాష్ ఉండేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. వారం రోజుల్లో పంపిణీ చేసేలా చెక్కుల ముద్రణ చేపట్టాలని బ్యాంకులకు సూచించింది వ్యవసాయ శాఖ.

Posted in Uncategorized

Latest Updates