రెండో సారి: విజ్డ‌న్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా కోహ్లి

kohliటీమిండియా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజ్డన్‌ లీడింగ్ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో భారత జట్టు సారథి మిథాలీ రాజ్‌కు విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. గతేడాది కూడా కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు. అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది. అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2,818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

భారత జట్టును మహిళల ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లిన మిథాలీ రాజ్ మహిళల విభాగంలో వన్డేల్లో ఆల్‌టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచింది. మొత్తంగా ప్రతిష్టాత్మక క్రికెటర్స్ ఆఫ్ ది అవార్డుకు ఐదుగురిని ఎంపిక చేశారు. వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్‌లో ముగ్గురు ప్లేయర్లు అన్యా శ్రుబోస్లే, కెప్టెన్ హీదర్ నైట్, ఆల్‌రౌండర్ నటాలీ సీవెర్‌లకు కూడా ఈ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates