రెండో T 20: ఇంగ్లండ్ దే విజయం

halesమొదటి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా..రెండో మ్యాచ్ లో విఫలమైంది. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి భారత్ స్కోర్ చేయడంలో ఇబ్బంది పడింది. శుక్రవారం(జులై-6) జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులను మాత్రమే చేయగలిగింది. 22 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన టీమిండియాను రైనా(27) విరాట్‌ కోహ్లీ(47) ధోనీ (32) పరుగులతో ఆదుకున్నారు. భారత్‌ ఆఖరి మూడు ఓవర్లలో 37 పరుగులు చేసింది. తర్వాత 149 పరుగు లక్ష్యచేధనలో ఇంగ్లండ్  మొదట కాస్త తడబడింది. వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు హేల్స్ (58)తో విజయాన్ని అందించాడు.

Posted in Uncategorized

Latest Updates