రెగ్యులర్ చెకప్ కోసమే : మణిరత్నం హెల్త్ పై పుకార్లు అవాస్తవం

రెగ్యులర్ చెకప్ కోసమే మణిరత్నం అపోలో హాస్పిటల్ కు వెళ్లారన్నారు ఆయన స్పోక్స్ పర్శన్ నిఖిల్ మురుగన్ తెలిపారు. అయితే గురువారం(జులై-26) మధ్యాహ్నాం ప్రముఖ సినీ డైరక్టర్ మణిరత్నంకు గుండెపోటు రావడంతో కుటుంభసభ్యులు మణిరత్నంను హాస్పిటల్ కు తీసుకొచ్చారని వార్తలు వచ్చాయి. మణిరత్నం ఆరోగ్యంపై వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నిఖిల్ మురుగణ్ తెలిపారు. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆయన అపోలో హాస్పిటల్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు. మణిరత్నం క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు మణిరత్నం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్ధితులపై అడిగి తెలుసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates