రెడ్ల సమస్యలను పరిష్కరిస్తాం : నాయిని

REDDYరెడ్డి కులంలో పుట్టినందుకు ఎవరికీ అన్యాయం జరగవద్దు అన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆదివారం (మే-27) హైదరాబాద్ లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నాయిని మాట్లాడుతూ..సమస్యలపై ఐక్యంగా పోరాడదామన్నారు.  ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు.

ఇది రెడ్ల సభ.. రాజకీయ సభ కాదని.. రెడ్డికి ఉద్రేకం ఎక్కువ అన్నారు. ఆవేశంతో పనులు కావు అని చెప్పిన నాయిని..  తెలివితేటలతో పనులవుతాయన్నారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు రెడ్డి సంఘాల నేతలు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రెడ్లు.

Posted in Uncategorized

Latest Updates