రెడ్‌ మి కొత్త ఫోన్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో Y2

Xiaomi-redmi-Y2చైనా మొబైల్‌ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్‌ మీ వై సిరీస్‌లో మరో న్యూ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే Y1 డివైస్‌ అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్‌ యువర్‌ సెల్పీ అంటూ Y 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభించింది. 3GB/32GB స్టోరేజ్‌, 4GB/64GB స్టోరేజ్‌  వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే , రోజ్ గోల్డ్ కలర్స్‌లో  ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి. వీటి ధరలు వరుసగా 9,999, 12,999 రూపాయలుగా ఉండనున్నాయి. రెడ్‌మీ  Y1 కంటే ఫేస్‌ అన్‌లాక్‌ మోడ్‌, మియూఐ 9.5 అప్‌డేట్‌ ఫీచర్లతో 37 శాతం మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన ఫ్రంట్ కెమెరా Y2 సెల్ఫీ స్మార్ట్ ఫోన్ స్పెషల్ అంటోంది కంపెనీ. Y2ను బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 12 మధ్యాహ్నం 12 గంటలకు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది.

 రెడ్‌మి Y2 ఫీచర్లు…

5.99 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో
720×1440  రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగెన్ 625 ప్రాసెసర్
3 GB /32 GB స్టోరేజ్‌, 4 GB /64 GB స్టోరేజ్‌
స్టోరేజ్‌ 256 GB వరకు విస్తరించుకునే అవకాశం
12+5 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్పీ ఏఐ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Posted in Uncategorized

Latest Updates