రెడ్ అలర్ట్ : కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు

కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. రానున్న మూడు రోజుల్లో కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. పునరావాస శిబిరాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా యంత్రాంగాలను కోరింది. అక్టోబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సముద్రంలోకి వెళ్లొద్దని మత్యకారులకు సూచించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేయమని సూచించారు.

ఐఎండీ హెచ్చరికలతో కేరళ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పలక్కాడ్‌లోని మలంపుజ డ్యామ్‌ గేట్లను అధికారులు గురువారం(సెప్టెంబర్-4) ఎత్తివేశారు. మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్‌ అలర్ట్‌ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం పిన్నరయి విజయన్ చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates