రెమ్యునరేషన్ సరిపోక : నకిలీ నోట్ల కేసులో టీవీ నటీ ఫ్యామిలీ అరెస్ట్

NANNAనకిలీ నోట్ల ప్రింటింగ్ కేసులో మళయాలం టీవీ సీరియల్ నటి సూర్య శశికుమార్‌ (36) ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య శశికుమార్, ఆమె తల్లి రమాదేవి(36), చెల్లెలు శ్రుతి(29) ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇడుక్కి జిల్లాలోని కట్టప్పన దగ్గర ఉన్న ఇంట్లో వీళ్లు ఫేక్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సీరియల్స్ ద్వారా వచ్చే సంపాదన సరిపోకే ఆమె తన కుటుంబంతో కలసి ఫేక్ నోట్లను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఎనిమిది నెలల్లో 57 లక్షల విలువైన ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రద్దయిన 500 రూపాయల నోట్లను వీళ్లు తమ ఇంట్లో ప్రింట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఇంట్లో నుంచి ఓ కంప్యూటర్, ప్రింటర్, ఆర్బీఐ సీల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రోజు సీరియల్స్ లో చూసే ఆ నటిని వార్తల్లో మళయాళీలు షాక్ అవుతున్నారు. రెమ్యూనరేషన్ సరిపోక ఆమె ఈ పని తాము భావించలేదని వారు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates