రెయిన్ ఎఫెక్ట్.. బీ అలర్ట్ : సిటీలో 190 వాటర్ లాగింగ్ పాయింట్స్

RAIN IN CITY POLICEఇరుకైన రోడ్లు..  ఓ వైపు  పైపులైన్ల  నిర్మాణం.. మరోవైపు  రోడ్ల మరమత్తులు.  వీటికి  తోడు  రోడ్లపై వాటర్ లాగింగ్  పాయింట్లు. వీటన్నింటితో  సిటీలో  ట్రాఫిక్ జామ్  ఏర్పడి  వాహనదారులు ఇబ్బందులు  పడుతున్నారు.  అయితే  వర్షాల కారణంగా  సిటీలో  ఏర్పడే  ట్రాఫిక్  సమస్యలకు  చెక్ పెట్టేందుకు  రెడీ అయ్యారు  పోలీసులు. సిటీలో  వాటర్ లాగింగ్స్  నుంచి  ట్రాఫిక్ జామ్ ను  నివారించేందుకు  GHMC, వాటర్  వర్క్స్  డిపార్ట్ మెంట్ తో  కలిసి  పక్కా ప్లాన్ తో  ముందుకెళ్తున్నారు  ట్రాఫిక్ పోలీసులు.

ఇప్పటికే  సిబ్బందిని  అలెర్ట్ చేసిన  పోలీసులు..  సిటీలో  మొత్తం 195  వాటర్ లాగింగ్  పాయింట్లను గుర్తించారు. సిటీలో  ఎక్కువగా  ట్రాఫిక్ జామ్,  వాటర్ లాగింగ్స్  పాయింట్స్  ఉన్న ఏరియాలపై  పోలీసులు ఎక్కువగా  ఫోకస్ చేశారు.  ఇప్పటికే  మేజర్ వాటర్  లాగింగ్  పాయింట్లను  గుర్తించి  యాక్షన్ ప్లాన్ రెడీ  చేశారు.  రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా ఉండేందుకు విద్యుత్ మోటర్లు, 25 ట్రాఫిక్ క్రేన్లతో పాటు మరో 19 రకాల డిజాస్టర్ పరికరాలతో రెడీ అయ్యారు. వర్షాలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటికే సిబ్బందికి రెయిన్ కోట్లు, పలుగుపార, కట్టర్లను ఇచ్చామని చెబుతున్నారు పోలీసులు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్ చేస్తూ..సోషల్ మీడియా, మొబైల్ యాప్స్ ద్వారా వాహనదారులను అప్రమత్తం చేస్తామంటున్నారు. వర్షాకాలం రాత్రి వేలల్లో కూడా ఒక్కో పోలీస్ స్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుళ్లను డ్యూటీలో ఉంచి..ఎస్సై స్థాయి అధికారితో వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తిస్తామని చెబుతున్నారు. ఈ ఏడాది సిటీలో భారీ వర్షాలు కురిసినా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు పోలీసులు. ఎంత వర్షం పడినా సిటీలో ట్రాఫిక్ జామ్స్ లేకుండా చూస్తామంటున్నారు పోలీసులు. ఇప్పటికే నెలరోజులుగా వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ పనులు చేయిస్తున్నారు. మేజర్ ప్రాంతాలైన పంజాగుట్ట, మలక్ పేటలో ట్రాఫిక్ లేకుండా పోలీసులు  చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates