రెవెన్యూ ఉద్యోగులకు కానుక: ఇన్సెంటివ్ గా నెల సాలరీ

kcrభూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజెందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో  ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులుండడం తెలంగాణ ప్రజలు, రైతుల అదృష్టంగా భావిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు  కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారని… వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఆర్ఏలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు.. మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూల వేతనం అదనంగా అందించాలని సిఎం అధికారులను సూచించారు.

రాష్ట్రంలో 22లక్షల యాభై వేల ఎకరాల భూమిలో 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చిందని సిఎం తెలిపారు. మిగతా రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా విషయాల్లో పూర్తిగా వివరాలు దొరకడం మామూలు విషయం కాదన్నారు సీఎం.

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూ రికార్డుల ప్రక్షాళన నిరూపించిందన్నారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates