రెవెన్యూ శాఖలో 316 పోస్టులు

రెవెన్యూ శాఖకు తెలంగాణ ప్రభుత్వం 316 పోస్టులను మంజూరు చేసింది. వీటిలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం క్షేత్ర స్థాయిలో తహసీల్దార్‌, రెవెన్యూ డివిజన్‌, జిల్లా కలెక్టరేట్ల కోసం 284 పోస్టులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయానికి 32 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు నిన్న(సోమవారం-జూలై 23) జీవోనెం.104ను జారీ చేశారు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శివశంకర్‌.

మంజూరైన పోస్టులు:- డిప్యూటీ కలెక్టర్-2, తహసీల్దార్-26, సీనియర్ అసిస్టెంట్/గిర్దావర్-152, జూనియర్ అసిస్టెంట్-23, రికార్డ్ అసిస్టెంట్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-56, చాకీదార్/వాచ్ మన్-10, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే-2, డిప్యూటీ స్టాటిస్టికట్ ఆఫీసర్-2, చైన్ మన్-7.

సీసీఎల్ ఏ కార్యాలయానికి…ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్ వో-1, డిఫ్యూటీ కమిషనర్-1,అసిస్టెంట్ సెక్రటరీ-1, అదనపు సహాయ కమిషనర్-2, సూపరింటెండెంట్ గ్రేడ్-1- 6, సూపరింటెండెంట్  ఆర్డినరీ గ్రేడ్-10, సీనియర్ అసిస్టెంట్-7, రికార్డ్ అసిస్టెంట్-4.

Posted in Uncategorized

Latest Updates