రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ : గుహ నుంచి ఆరుగురు చిన్నారుల వెలికితీత

childగతకొన్ని రోజులుగా థాయిలాండ్ లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌ బాల్ చిన్నారులు, వారి కోచ్‌ ను రక్షించే ప్రయత్నంలో రెస్క్యూ సిబ్బంది గొప్ప విజయం సాధించారు. ఆదివారం (జూలై-8) గుహ నుంచి ఆరుగురు చిన్నారులను విజయవంతంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ విజయంతో మిగతా వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 16 రోజులుగా గుహలో చిక్కుకుని బాహ్య ప్రపంచానికి దూరంగా చీకటి గుహలో ఉండడంతో వారి మానసిక పరిస్థితిలో మార్పు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన వారు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. పలువురు మాజీ సైనికులు, నావికాదళ డైవర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్‌ లో పాలు పంచుకుంటున్నారు. గుహలో చిక్కుకున్న చిన్నారులు క్షేమంగా బయటకు రావాలంటూ ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. సహాయక చర్యలు ఇదే స్థాయిలో కొనసాగితే మరో రెండుమూడు రోజుల్లోనే మిగతా ఏడుగురిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates