రేటు అదిరింది : స్టార్ టీవీలోనే క్రికెట్ మ్యాచ్ లు

starభారత క్రికెట్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్ల ప్రసార హక్కులను రూ.6వేల 138కోట్ల 10లక్షలకు స్టార్ ఇండియా దక్కించుకుంది. ఈ-ఆక్షన్ ద్వారా ప్రసార హక్కుల వేలం నిర్వహించింది బీసీసీఐ. మిగతా సంస్థలను వెనక్కి నెట్టి రైట్స్ సొంతం చేసుకుంది స్టార్ ఇండియా. ఈ-ఆక్షన్ లో సోనీ స్పోర్ట్స్ తీవ్రంగా పోటీ ఇచ్చింది. 2012-18 మధ్య ప్రసార హక్కులు కూడా స్టార్ ఇండియా దగ్గరే ఉన్నాయి. గతంలో 2012-18 ప్రసార హక్కులను 3వేల 851 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక 2018-23 మధ్య 104 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. గతం కంటే డబుల్ రేటు పెట్టి మరీ స్టార్ గ్రూప్.. ఈ క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులను సొంతం చేసుకోవటం విశేషం.

Posted in Uncategorized

Latest Updates